టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా ఉపాసన
posted on Jan 29, 2019 9:01AM
సినీ నటుడు రామ్ చరణ్ సతీమణి ఉపాసన చేవెళ్ల లోక్ సభ స్థానం నుంచి టీఆర్ఎస్ తరుపున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనుంది అంటూ ఓ ఆంగ్లపత్రిక రాసుకొచ్చింది. కాగా ఈ వార్తలను ఉపాసన ఖండించింది. ఉపాసన తనకు వరుసకు బాబాయ్ అయ్యే చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిపై పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. టీఆర్‌ఎస్ తరఫున ఆమె పోటీ చేయబోతున్నట్లు రాశారు. విశ్వేశ్వర్ రెడ్డి తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. చేవెళ్ల నుంచి లోక్‌సభకు పోటీ చేసి ఎన్నికయ్యారు. తర్వాత పార్టీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్‌లో చేరారు. వచ్చే ఎన్నికల్లో ఆయనపై విజయం సాధించాలంటే బలమైన అభ్యర్థిని నిలబెట్టాలని, అందుకు ఉపాసన సరైన ఛాయిస్ అని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కేటీఆర్ భావిస్తున్నట్లు పత్రికలో రాశారు. ఆ ప్రచారంలో ఏ మాత్రం నిజంలేదని ఉపాసన సోషల్‌మీడియా వేదికగా స్పష్టం చేశారు. ‘క్షమించండి ఇందులో నిజం లేదు.. ప్రస్తుతం నేను నా జాబ్‌ను ప్రేమిస్తున్నా. విశ్వేశ్వర్ రెడ్డి భార్య సంగీతా రెడ్డి నా బాస్. చిన్నాన్న చేవెళ్లకు చేస్తున్న సేవ సాటిలేనిది’ అని ఆమె పోస్ట్ చేశారు. ఎన్నికల సమయంలో ఇలాంటీ గాసిప్స్ సర్వసాదరణం అయిపోయాయి. ఏదైతేనేం ఉపాసన ఓ క్లారిటీ ఇచ్చేసింది.