రెచ్చిపోయిన సలావుద్దీన్...ఏ క్షణమైనా విరుచుకుపడతాం.. చూస్తుండండి
posted on Jul 4, 2017 12:25PM
.jpg)
అవును..ఇండియాలో పలు దాడులు చేశామని హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్ బహిరంగంగానే ఒప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మరింత రెచ్చిపోయి పలు సంచలన వ్యాఖ్యలు చేశాడు. "మా దృష్టి అంతా ఇప్పుడు భారత దళాలపైనే ఉంది.. వారు ఎప్పుడు, ఎక్కడ ఉంటారో మాకు తెలుసు... కాశ్మీరులో పౌరులు, బహిరంగ ప్రదేశాల్లో దాడులు చేయకూడదని నియమం పెట్టుకున్నాం. మా వ్యవహారాలన్నీ భారత సైన్యానికి వ్యతిరేకంగానే ఉంటాయి. వారిపై ఏ క్షణమైనా విరుచుకుపడతాం. చూస్తుండండి. ఆ బలం, సామర్థ్యం మాకున్నాయి. కాశ్మీర్ లో వారి ఆగడాలను ఆపేందుకు ఒక్క అవకాశాన్ని ఇవ్వాలన్న ఆలోచనతోనే వేచి చూస్తున్నాం. భారత దళాలకు అనుకూలంగా, ముజాహిద్దీన్ లకు వ్యతిరేకంగా కాశ్మీర్ లో పని చేస్తున్న వారికీ శిక్ష తప్పదని వ్యాఖ్యానించాడు. కాగా సయ్యద్ సలావుద్దీను ఇటీవలే అమెరికా అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన సంగతి తెలిసిందే.