నోట్ల రద్దుపై సుప్రీం కీలకవ్యాఖ్యలు...మరో అవకాశం ఇవ్వండి..

 

నల్లధనాన్ని అరికట్టేందుకు గాను కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇక పాత నోట్లను డిసెంబర్ 31 లోగా మార్చుకోవడానికి గడువు ఇచ్చింది. కానీ కొంతమంది మాత్రం డిపాజిట్ చేసుకోలేకపోయారు. ఇక ఆతరువాత మార్చి 31 వరకూ గడువునిచ్చింది. కానీ అప్పటికీ కూడా కొంతమంది డిపాజిట్ చేసుకోలేకపోయారు. దీంతో తమకు మరో అవకాశం కల్పించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిల్‌ వేశారు. దీనిపై నేడు న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఇక దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు... రద్దైన నోట్లను మార్చుకోవడానికి మార్చి 31 వరకే గడువు ఎందుకు ఇచ్చారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నిజాయతీ గల పౌరులను ఇబ్బందులకు గురి చేయడం తగదని, మరోసారి గడువు ఇచ్చే అంశంపై రెండు వారాల్లోగా బదులివ్వాలని ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించింది. జనం కష్టపడి సంపాదించుకున్న సొమ్ము వారికి నిరూపయోగంగా మారితే ఎలా..? అంటూ ప్రశ్నించింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu