నటి కాదంబరి జత్వానీ కేసులో ఐపీఎస్ లకు ఊరట... ముందస్తు బెయిలు మంజూరు చేసిన ఏపీ హైకోర్టు
posted on Jan 7, 2025 10:29AM
ముంబై నటి జత్వానీపై వేధింపుల కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ముగ్గురు ఐపీఎస్ అధికారులకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో వారు దాఖలు చేసుకున్న యాంటిసిపేటరీ బెయిలు పిటిషన్ ను విచారించిన కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ మాజీ సీపీ కాంతిరాణా టాటా, ఐపీఎస్ అధికారి విశాల్ గున్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు యాంటిసిపేటరీ బెయిలు మంజూరు చేసింది. వీరితో పాటు ఇబ్రహీంపట్నం మాజీ సీఐ హనుమంతరావు, న్యాయవాది వెంకటేశ్వర్లుకు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చే చేస్తూ కోర్టు మంగళవారం (జనవరి 7) తీర్పు వెలువరించింది.
సినీ నటి కాదంబరి జత్మలానీని వేధించిన ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ మాజీ సీపీ కాంతి రాణా టాటా, ఐపీఎస్ అధికారి విశాల్ గున్నిని సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. తప్పుడు కేసులో ముంబై నటి కాదంబరి జత్వానీని అరెస్ట్ చేసి, ఇబ్బందులకు గురిచేసిన వ్యవహారంలో వీరు ముగ్గురూ కీలకంగా వ్యవహరించారన్న అభియోగాలు ఉన్నాయి.