నేను పెళ్ళి చేసుకోవట్లేదు... రూమర్సే... అనుష్క...

 

దక్షిణాది హీరోయిన్ అనుష్క త్వరలో పెళ్ళి చేసుకోబోతోందని, పెళ్ళికొడుకు ఫలానా ఫలానా అని గత కొన్ని రోజులుగా మీడియాలో వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఎలాగూ అనుష్క వయసు పెరిగిపోతోంది కదా.. బాహుబలి, రుద్రమదేవి అయిన వెంటనే అనుష్క పెళ్ళి చేసుకోవడం న్యాయమేలే అని జనం కూడా అనుకోవడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో అనుష్క ఎక్కడికి వెళ్ళినా జనం కంగ్రాట్స్ చెబుతున్నారట. దాంతో బిత్తరపోయిన అనుష్క వెంటనే తన మేనేజర్‌తో ఓ ప్రకటన ఇప్పించేసింది. తాను పెళ్ళి చేసుకోబోవడం లేదని, అవన్నీ ఒట్టి పుకార్లేనని ఆ ప్రకటన మొత్తం సారాంశం.