టాలీవుడ్‌లో విషాదం.. హీరో రవితేజ సోదరుడి దుర్మరణం

టాలీవుడ్ హీరో రవితేజ సోదరుడు భరత్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. శంషాబాద్ మండలం కొత్వాల్‌గూడ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో భరత్ దుర్మరణం పాలయ్యారు. వేగంగా ప్రయాణిస్తున్న ఆయన కారు ఆగివున్న లారీని ఢీకొనడంతో భరత్ అక్కడికక్కడే మరణించారు. పెద్ద శబ్ధం రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. భరత్ పలు చిత్రాల్లో సహాయక పాత్రలు చేశారు..ఆయన మరణవార్తను తెలుసుకున్న సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.