ఆయిల్ పోయింది..123 మంది బలి

పాకిస్థాన్‌లో ఘరో ప్రమాదం జరిగింది. బహవల్‌పూర్ ప్రాంతంలో జాతీయ రహదారిపై ఓ ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడి మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 123 మంది సజీవదహనమయ్యారు. ట్యాంకర్ బోల్తాపడటంతో రహదారిపై భారీగా ఆయిల్ లీకయింది..దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలంతా బకెట్లతో ఆయిల్‌ను తోడుకోవడానికి తండోపతండాలుగా వచ్చారు. ఇంతలో ట్యాంకర్ పేలిపోవడంతో అక్కడున్నవారంతా దుర్మరణం పాలయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. తీవ్ర గాయాలపాలైన 70 మందిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. జనం ఆయిల్ తోడుకుంటుండగా..ఓ వ్యక్తి సిగరెట్ తాగడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu