భారీ వర్షాలతో ఢిల్లీ అతలాకుతలం

దేశ రాజధాని నగరం భారీ వర్షాలతో అతలాకుతలమైంది. భారీ వర్షాల కారణంగా ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ని టెర్మినల్ 1 లో పై కప్పు కుప్పకూలింది.

ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. కుప్ప కూలిన పైకప్పు కింద ఇంకా కొందరు చిక్కుకున్నారన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.  

 మరో వైపు  గురువారం (జూన్ 27) రాత్రి నుంచి కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షం కారణంగా   లోతట్టు ప్రాంతాలు జలయమమైపోయాయి. వరద నీటిలో పలు కార్లు కొట్టుకుపోయాయి. సహాయక బృందాలు రంగంలోకి దిగాయి.