ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం
posted on Apr 26, 2020 7:16PM
* కోస్తాంధ్ర లో పిడుగులతో కూడిన వర్షాలు
ఆగ్నేయ బంగాళాఖాతంలో మే మొదటివారంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, కోస్తాంధ్ర లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఆంధ్ర ప్రదేశ్ విపత్తుల శాఖ కమిషనర్ కన్నబాబు తెలిపారు. తీరం వెంబడి గంటకు 40-50 కీ.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడేప్పుడు పిడుగులు పడే అవకాశం ఎక్కువ ఉన్నందున పొలాల్లో పనిచేసే రైతులు,కూలీలు, పశు ,గొర్రెల కాపరులు వెంటనే సురక్షితమైన ప్రాంతాలకు వెళ్లాలి. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల శాఖ కమిషనర్ కె. కన్నబాబు సూచించారు. రాగల 48 గంటలు రాయలసీమలో 41°C -43°C అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉన్నందున పసిపిల్లలు, వృద్దులు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల శాఖ కమిషనర్ కన్నబాబు సూచించారు.