ఏపీ పెన్షనర్లకు హ్యాపీ న్యూస్ 

* పూర్తి పెన్షన్ చెల్లింపునకు ప్రభుత్వ నిర్ణయం 

ఏప్రిల్ నెల జీతాల చెల్లింపుకు ఉత్తర్వులు జారీ చేస్తూ - ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక శాఖ జి.ఓ. నెంబర్ 37 విడుదల చేసింది. పెన్షనర్లకు 100% పెన్షన్, మిగతా ఉద్యోగులకు గత నెల జారీ చేసిన ఉత్తర్వులు 26(50% & 90%) & 27 (100% అత్యవసర సేవలందిస్తున్న ఉద్యోగులకు) మేరకు జీతాలు చెల్లించేలా నిర్ణయం తీసుకుంది. కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా వరుసగా రెండో నెల కూడా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగ స్థాయిలకు అనుగుణంగా జీతాల్లో కోతలు చేస్తూ నిర్ణయించింది. కరోనాపై పోరులో ఆర్థిక భారం ప్రభుత్వంపై పడటంతో ఉద్యోగుల జీతాల్లో కోతలు విధించక తప్పడం లేదని ప్రభుత్వం అంటోంది.