అల్లం రసం అద్భుత లాభాలు...
posted on Apr 28, 2022 9:30AM
అల్లం ఒక అద్భుతమైన మూలిక అందరూ దీనిని ఒక మసాలా రూపంలో చూస్తారు. దీనిని ఒక సుగంధంగా ద్రవ్యం గా చూస్తారు. అందుకే ఆహారం లో వాడేందుకు ఇష్టపడతారు.సహజంగా భారత దేశం లో అల్లం టీ లో ఎక్కువగా వాడడం మనం గమనించవచ్చు. అల్లం కేవలం సువాసన,రుచిని పెంచే పని మాత్రమే చేయదు.దీనిలో ఎన్నో సంపూర్ణ ఆరోగ్య లాభాలు నిండి ఉన్నాయని చాలా రకాల గుణాలు ఉన్నాయన్న విషయాన్ని అంగీకరించక తప్పదు. ఎందుకంటే అల్లం ఆరోగ్యానికి గుణవంత మైన ప్రభావ వంతమైన ఔషద మని అంటారు. ముఖ్యంగా బాలింతలకు ప్రసవం తరువాత సొంట్టి ఖారం తినాలని బాలింతలకు పాలఉత్పత్తి పెరగడానికి సొంట్టి దోహదం చేస్తుంది. మీరు ఉదయం లేచిన వెంటనే అల్లం రసం తీసుకుంటే చాలా లాభాలు లభిస్తాయని ఆయుర్వేద వైద్యులు డాక్టర్ చిట్టిబోట్ల మధుసూదన శర్మ పేర్కొన్నారు. అల్లంలో యాంటి ఆక్సిడెంట్,యాంటీ ఫంగల్,యాంటీ బ్యాక్టీరియల్,యాంటీ వైరల్ వంటి సమస్యలకుచక్కని ఔషదం అల్లం రసం. వాతావరణం లో వచ్చే మార్పులు ఇతర అనారోగ్యాలు సోకకుండా కప్పడే గుణం అల్లంలో ఉందని అంటారు నిపుణులు. అల్లం రసం తాగడం వల్ల శరీరంలో ఉన్న పంచేంద్రియాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
అల్లం రసం తాగడం వల్ల లాభాలు...
1)ఊబకాయం తగ్గించడం లో అల్లం సహకరిస్తుంది---.మీరు ఒకవేళ అధిక బరువు ఊబకాయం లో బాధపడుతున్నారా.మీరు అల్లం రసం వల్ల మీకు లాభం ఉండవచ్చు.ప్రతిరోజు ఉదయం ఒకగ్లాసు అల్లం రసం తాగడం వల్ల బరుతగ్గడం లో మీకు సహకరిస్తుంది అల్లం రసం.
2)పంచేంద్రియాలలో సహాయ పడవచ్చు...
అల్లంలో యాంటి ఇంఫ్లామేటరీ గుణాలు గుర్తించవచ్చు.కడుపులో మంట,పుల్లటి తేన్పులు, వెక్కిళ్ళు, వంటి సమస్యలకు అల్లం కొంత ఉపసమనం కలిగిస్తుంది.ఉదయం వేళ పరగడుపునే మీ ఆహారం అరుగుదలకు సహాయా పాడేది అల్లం రసం,లేదా మామిడి అల్లం,లేదా మార్కెట్లో లభించే అల్లం మురబ్బ కూడా మీ అర్గ్యం అరుగుదలకు సహాయపడుతుంది.
౩)డయాబెటిస్ నియంత్రణ లో అల్లం....
డయాబెటిస్ మిమ్మల్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టడం లేదా చక్కర శాతం లో హెచ్చు తగ్గులు వస్తూ ఇబ్బంది పెడుతుంటే ప్రతిరోజూ ఉదయం అల్లం రసం తీసుకోవడం వల్ల డయాబెటిస్ వల్ల పెరిగే బ్లడ్ షుగర్ ను తగ్గించ వచ్చు.
4)చర్మ సౌందర్యానికి అల్లం...
మొటిమలు,ముఖం పై మచ్చలు,చారలు,,వంటివి వేదిస్తున్నాయా,అలం రసం తీసుకుంటే శరీరంలో ఉండే విష్ తుల్యమైన పదార్ధాలను తొలగించి ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయ పడుతుంది.