వేసవిలో ఉసిరికాయ తింటే ఏమౌతుంది?
posted on Apr 29, 2022 9:30AM
ప్రకృతిలో మనకు ఎనోరకాల గుణాలు ఉన్న రక రకాల ఔషదులు ఎన్నో అందుబాటులో ఉన్నాయి.
ప్రకృ తి నుండి మనకు లభించిన వరం ఉసిరి అని అంటున్నారు ఆయుర్వేద వైద్యులు. ప్రతిరోజూ మీరు ఉసిరి కాయ తీసుకుంటే అద్భుతమైన లాభాలు ఉన్నాయని అంటున్నారు నిపుణులు. మనం మన శరీరం చురుకుగా ఉండాలంటే ప్రాకృ తికంగా మనకు లభించిన వాటినే నమ్ముతాం. ఇందులో మొదటగా చెప్పే పేరు ఉసిరి దీనిఅద్భుతమైన చమత్కారం ఔషద గుణాల కారణంగా ఆయుర్వేదం లో ఉసిరిక ఒక వరమని అంటారు నిపుణులు. కోరోనా వైరస్ మహమ్మారి మనందరికీ ఆరోగ్యం యొక్క విలువ ఒక గుణపాటం నేర్పింది. ఇప్పుడు చాలా మంది ప్రజలు ఆరోగ్యం ఫిట్ నెస్ పై దృష్టి పెట్టారు.తినే ఆహారం విషయం లో ఒకానొక విషయం లో ఆయుర్వేదం లో అనేక ఉపాయాలు ఔషదాలు ఉండేవి మనకు చికిత్స రూపం లో లభించేది. ఆవిధంగా ఉసిరి చాలా ప్రాచుర్యం పొందింది. సహజంగా ఉసిరి పచ్చడి,లేదా ఉసిరి రసం లేదా ఉసిరి కాయను పచ్చిది తిన్నప్పుడు ఔషద గుణాలు పుష్కలంగా ఉంటాయి.ఆయుర్వేదం లో ఏదైతే వాత,పిత్త,కఫ దోషాలు ఉంటాయి.వాటిని సరిగా పనిచేసే విధంగా ఔషద గుణాలు ఉంటాయి.పనిచేసే విధంగా దోహదం చేస్తుంది.అయితే రోజూ మనం ఉసిరి తినడం వల్ల లాభమా నష్టమా తెలుసుకుందాం.
రోజూ ఉసిరిని ఎందుకు తినాలి...
ఉసిరిని సంస్కృతం లో ఉసిరిక ఆమ్లిక అని అంటారు.అంటే దీనిఆర్ధం జీవ అమృతం. ఉసిరికలో ఉన్న తత్వాలు విటమిన్ సి పీచుపదార్ధాలు.ఖనిజ లవణాలు ఉంటాయి.యాంటి ఆక్సిడెంట్ సంపూర్ణంగా ఉంటుంది. ఉసిరికలో నారింజ,సిట్రిక్ తో పోలిస్తే 1౦ గుణాలు ఎక్కువగా ఉంటుంది.విటమిన్ సి ప్రీరాడి కల్స్ద్వారా వచ్చే నష్టాన్ని నివారిస్తుంది.జీవం లేని కణాలకు తిరిగి శక్తి వంత మయ్యేందుకు సహాయా పడుతుంది.
ప్రతి రోజూ ఉసిరి తినడం వల్ల ఉపయోగాలు...
సహజంగా మన శరీరంలో ఉన్న పంచేంద్రియాలలో జలుబు,దగ్గు,ఎలర్జీ,వంటివి అనారోగ్య సంమస్యలు చికిత్స చేసేందుకు దోహద పడుతుంది.ఈ విధంగా ఉసిరికలో ఎక్కువ స్థాయిలో యాంటి ఇంఫ్లామేటరీ క్యాన్సర్ ను ఎదుర్కునే గుణాలు ఉనాయని నిపుణులు పేర్కొన్నారు. ఉసిరికను పచ్చిది తినాల లేదా ఉసిరి రసాన్ని సేవించడం ద్వారా అనారోగ్య సమస్యలు మెరుగు పడతాయి.
రోజూ ఎన్ని ఉసిరికాయాలు తినాలి?ఎందుకు...
నిపుణుల సూచన ప్రకారం వారి వారి వయస్సు లను బట్టి,75 నుండి 9౦ ఎం జి ఉసిరి ని తీసుకోవచ్చు.1౦౦ గ్రాముల ఉసిరిలో ౩౦౦ ఎం జి విటమిన్ సి డై టరీ ఫైబర్,కాల్షియం ఐరన్,యాంటి ఆక్సిడెంట్,ఉంటాయి.ప్రతిరోజూ ఉసిరితినడం వల్ల రోగనిరోధక శక్తి పెంచుకోండి. వయస్సు పెరుగుతున్న కొద్ది ఎదురయ్యే సవాళ్ళను తగ్గిస్తుంది.ఉసిరినుండి విటమిన్ ఏ ద్వారా కంటికి ఉపయుక్తమైన విటమిన్ లభిస్తుంది.
ప్రతి రోజూ మన భోజనం లో ఉసిరిని ఎలా చేర్చాలి...
ఉసిరి తియ్యగా,పుల్లగా చేదుగా వగరుగా ఉంటుంది కాబట్టిపచ్చి ఉసిరి తినడం కష్టం.అయితే నిపుణుల సూచన ప్రకారం పచ్చ్చి ఉసిరికాయ రసం ఎండలో ఎండపెట్టిన ఉసిరి ముక్కలు తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి.డీహైడ్రేషన్ తగ్గిస్తుంది.ఎండలో ఎండపెట్టిన ఉసిరి లో పోషక తత్వాల తో పాటు మరే ఇతర అనారోగ్య సమస్యలు రానీయదు. ఉసిరి కేవలం ఫలమే కాదు ఔషదం అని కూడా అంటారు ముఖ్యంగా బ్రహ్మి ఆమ్లా కేష్ తెల్ పేరుతో వచ్చే నూనెలు వాడడం వల్ల జుట్టు కుదుళ్ళు గట్టి పడిజుట్టు ఒత్తుగా నిగనిగలాడుతూ ఉంటుందని నిపుణులు విశ్లేషించారుకాగా ఎండాకాలం లో ఒక్క ఉసిరి ముక్కను తిని ఒక్క గ్లాసు నీళ్ళు తాగితే చాలు దాహం అన్న మాట ఉండనే ఉండదు.కాస్త ఉసిరిని నూనెలో వేయించి ఆవకాయ పచ్చడి పెడితే ఉంటుంది అబ్బ ఆ టేస్టే వేరు అంటున్నారు భోజన ప్రియులు.అలాగే ఉసిరి గింజను తీసి వేసి బాగా దంచి చేసిన ఉసిరి ముద్ద పచ్చడి ఎండాకాలం లో ఒక్క ముద్దైనా పప్పులో కలుపుకుని తింటే ఆ రుచే వేరు మీరే ఆస్వాదించి చూడండి.