జర్నలిస్టులెవరో తేల్చండి!.. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడితే తాటతీస్తా.. రేవంత్

సోష‌ల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెట్టే సంస్కృతిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండి పడ్డారు.ఆలాంటి వారి విష‌యంలో సీరియ‌స్‌  యాక్ష‌న్ తీసుకుంటామ‌ని  హెచ్చ‌రించారు.  ప్ర‌జాప్ర‌తినిధులు త‌ప్పులు చేస్తే.. వారిని ప్ర‌శ్నించ‌డం వ‌ర‌కు ప‌రిమితం కావాల‌ని, కానీ, వారి ఇంట్లో ఆడ‌వాళ్లు ఏం త‌ప్పులు చేశార‌ని వారిపై నెగిటివ్ కామెంట్లు చేస్తున్నార‌ని  నిల‌దీశారు. ఈ విషయంపై అసెంబ్లీలో సుదీర్ఘంగా మాట్లాడిన రేవంత్‌రెడ్డి.. సోష‌ల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెడుతున్నవారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 ప్ర‌జాజీవితంలో ఉన్న తనను విమర్శిస్తే సహిస్తాకానీ. కానీ, తన భార్య‌, నా బిడ్డ ఏం చేశారని వారిపై అనుచిత వ్యాఖ్యలు అదీ  బండ బూతుల‌తో చేస్తున్నారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు? ఇలాంటి వారు స‌మాజానికి ఏం సందేశం ఇస్తున్నారు. వీరు ఏం జ‌ర్నలిస్టులు? ఇది ది ఏం జ‌ర్న‌లిజం?, ఇలాంటి కామెంట్లు చ‌దివినా.. విన్నా అన్నం కూడా తినాల‌ని అనిపించ‌డం లేదన్నారు. భూభార‌తి పేరుతో త‌న‌పై వ‌స్తున్న కామెంట్లు చ‌దివేందుకు కూడా మ‌న‌స్క‌రించ‌డం లేద‌న్నారు. ఇలాంటి వారికి తోలు తీస్తాన‌ని అసెంబ్లీ సాక్షిగా హెచ్చ‌రించిన రేవంత్ రెడ్డి, భూభార‌తి పేరుతో పేద‌ల భూముల‌ను వారికే చెందేలా చేస్తున్న త‌న ప్ర‌య‌త్నం త‌ప్పా? అని ప్ర‌శ్నించారు.

పెయిడ్ ఆర్టిస్టుల‌తో చేయిస్తున్న ఇలాంటి వీడియోలు అత్యంత దారుణంగా ఉంటున్నాయ‌ని సీఎం చెప్పారు. ఇలాంటివి చేయ‌డానికి అస‌లు మ‌న‌సు ఎలా వ‌స్తోంద‌ని నిల‌దీశారు. సమ‌స్య‌లు ఉంటే ఉండొ చ్చున‌ని.. వాటిని హ్యాండిల్ చేయాల్సిన తీరు మాత్రం ఇలా కాద‌న్నారు. “ఇంత‌లేసి మాట‌లు మీ నోటికి ఎలా వ‌స్తున్నాయి. మీరు మ‌నుషులేనా? మీకు భార్య‌, పిల్ల‌లు లేరా?” అని ప్ర‌శ్నించారు. ఇలాంటి వాటిని చూస్తూ ఊరుకునేది లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఇలాంటి విషపూరిత జర్నలిజంపై చర్చ జరగాలన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి జర్నలిస్టుల జాబితా తీసి ఎవరు జర్నలిస్టులో చెప్పాలని జర్నలిస్టు సంఘాలను కోరారు. జర్నలిజం డెఫినిషన్ చెప్పండి, తప్పు చేసిన జర్నలిస్టును మీరే శిక్షించండి, జర్నలిస్టు కాని వారిని క్రిమినల్ గానే చూస్తామనీ, అలాంటి క్రిమినల్స్ కి ఎలా బుద్ధి చెప్పాలో అలానే చెబుతామని అన్నారు.