కిస్ డే.. ముద్దు పెట్టుకోవడం వల్ల కలిగే 7 ప్రయోజనాలు ఇవే..!
posted on Feb 13, 2025 9:30AM

కిస్ డేని వాలెంటైన్స్ వారంలోని 7వ రోజు అంటే ఫిబ్రవరి 13న జరుపుకుంటారు. ప్రేమలో తగినంత నమ్మకం, సాన్నిహిత్యం ఉన్న దశకు చేరుకున్నప్పుడు, ప్రేమికులు తమ ప్రేమను టచింగ్ లేదా ముద్దు పెట్టుకోవడం ద్వారా వ్యక్తం చేస్తారు. ముద్దు అనేది కేవలం ప్రేమికుల మధ్య జిరిగే చర్య కాదు.. ఒక తల్లి తన బిడ్డను ముద్దు పెట్టినా, ఒక స్నేహితుడు తన స్నేహితుడికి ముద్దు పెట్టినా, తోబుట్టువులు ఆత్మీయంగా ముద్దు పెట్టినా.. ప్రతి ఒక్కటి ఈ కిస్ డే లో భాగమే.. ముద్దు అనేది ప్రేమ, ఆప్యాయతను వ్యక్తీకరించడానికి ఒక మార్గం మాత్రమే కాదు, ఇది శారీరక, మానసిక ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుందట. ఇష్టమైన వారిని ముద్దు పెట్టుకోవడం, ఆత్మీయంగా ఉన్నవారిని ముద్దు పెట్టుకోవడం మొదలైన వాటి వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు. అవేంటంటే..
ముద్దు ఒత్తిడిని తగ్గిస్తుంది..
శరీరంలో ఆక్సిటోసిన్, డోపమైన్, సెరోటోనిన్ హార్మోన్లు చాలా ముఖ్యమైనవి. ఇవి ఒత్తిడిని, ఆందోళనను తగ్గిస్తాయి. ఈ హార్మోన్లు శరీరంలో రిలీజ్ అవ్వడంలో ముద్దు ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. మనకు ఇష్టమైన వారిని సంతోషంగా ఉంచుతుంది.
రక్తపోటును నియంత్రిస్తుంది..
మనం ముద్దు పెట్టుకున్నప్పుడు హృదయ స్పందన పెరుగుతుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.
రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది
ముద్దు పెట్టుకున్న సమయంలో బ్యాక్టీరియా మార్పిడి జరుగుతుంది. దీని కారణంగా శరీరంలో కొత్త ప్రతిరోధకాలు ఏర్పడతాయి. రోగనిరోధక శక్తి బలపడుతుంది. ఇది వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడుతుంది. అయితే ఏదైనా అంటువ్యాధి సమస్య ఉన్నవారు ముద్దులకు కాస్త దూరం ఉండటం మంచిది.
కేలరీలను బర్న్ చేస్తుంది..
ముద్దు నిమిషానికి దాదాపు 2-6 కేలరీలను బర్న్ చేస్తుందట. ఇది జీవక్రియను పెంచడంలో, బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఒక అధ్యయనం ప్రకారం, ముద్దు పెట్టుకునే పద్ధతి, వ్యవధిని బట్టి నిమిషంలో 2 నుండి 26 కేలరీలు బర్న్ అవుతాయట. ఎందుకంటే ముద్దు శరీరంలోని అనేక భాగాల పనితీరు ప్రక్రియను వేగవంతం చేస్తుంది.
ముఖ కండరాలకు మంచిది..
ముద్దు పెట్టుకోవడం వల్ల ముఖ కండరాలకు మంచిదని అంటున్నారు. ఎందుకంటే ఇది 34 ముఖ కండరాలకు పైగా వ్యాయామంలాగా పనిచేస్తుంది. ముఖాన్ని టోన్ గా, యవ్వనంగా ఉంచుతుంది. ఇది ముడతలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది..
ముద్దు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దీనివల్ల గుండెపోటు, ఇతర హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
*రూపశ్రీ.