చంద్రబాబుకి, కేసీఆర్‌కి హ్యాపీ ఫాదర్స్ డే

 

ఈరోజు ఫాదర్స్ డే.. ప్రపంచ వ్యాప్తంగా వున్న తండ్రులకు వారి పిల్లలు కృతజ్ఞతలు తెలిపే రోజు. అభివృద్ధి పథంలో పయనిస్తున్న తమ పిల్లలను చూసి తండ్రులు సంతోషించే రోజు. తమ చిటికెన వేలు పట్టుకుని నడిచిన పిల్లలు తమ అంత ఎదిగి, తమ ప్రతిరూపాలుగా పెరుగుతూ, తాము నడుస్తున్న బాటలోనే విజయవంతంగా పయనిస్తుంటే ఏ తండ్రి అయినా ఎంతో సంతోషిస్తాడు.  పుత్రోత్సాహం కానివ్వడి, పుత్రికోత్సాహం కానివ్వండి.. ఆ ఉత్సాహం వారిని జనులు కొనుగొని పొగిడినప్పుడే ఆ తండ్రికి లభిస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, కె.చంద్రశేఖరరావు  ఇప్పుడు ఆ ఉత్సాహాన్ని పరిపూర్ణంగా ఆస్వాదిస్తున్నారు.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కుమారుడు నారా లోకేష్ తండ్రి దగ్గర రాజకీయ పాఠాలు నేర్చుకుని, తండ్రి అడుగు జాడల్లో నడుస్తూ రాజకీయంగా అభివృద్ధి పథంలో పయనిస్తున్నారు. రాజకీయ వారసత్వం వుంది కదా అని తాను శ్రమించకుండా ఆయన వుండరు. తన తండ్రి ఎలా కార్యకర్తల్లో ప్రజల్లో కలసిపోతారో ఈయన కూడా అచ్చం అదే శైలితో ముందుకు వెళ్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమనిధి కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న నారా లోకేష్ కార్యకర్తలను ఆదుకోవడంలో, అక్కున చేర్చుకోవడంలో ముందుంటారు. వ్యూహాత్మకంగా వ్యవహరించడం, ఎలాంటి పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కోవడం, రాజనీతిజ్ఞతను ప్రదర్శించడంలో నారా లోకేష్‌ది కూడా చంద్రబాబు శైలే. మరి ఇలాంటి సమర్థుడైన పుత్రుడు వున్న చంద్రబాబు నాయుడికి హ్యాపీ ఫాదర్స్ డే.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు తారక రామారావు, కుమార్తె కవిత అయితే ముమ్మూర్తులా తండ్రిలాంటివారే. ముఖ కవళికల్లో మాత్రమే కాదు.. రాజకీయ వ్యూహాలు వేయడంలో కూడా వీరిద్దరు తండ్రికి తగ్గవారే. కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర మంత్రిగా సమర్థంగా పనిచేస్తోంటే, కవిత నిజామాబాద్ ఎంపీగా తనదైన శైలితో ముందుకు దూసుకువెళ్తున్నారు. రాజకీయ వారసత్వం అనేది  తండ్రి ఇస్తే వచ్చేది కాదు.. శ్రమించి సాధించుకోవలసింది. అలా శ్రమించి తన రాజకీయ వారసత్వాన్ని పొందిన కేటీఆర్, కవిత ఇద్దరూ తమ తండ్రికి ఉత్సాహాన్ని ఇస్తున్న పిల్లలే కదా. ప్రతిభావంతులైన ఇద్దరు పిల్లలు తోడుగా రాజకీయ ప్రస్థానం చేస్తున్న కేసీఆర్‌కి కూడా ఫాదర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు.