అనుమానంతో ప్రియురాలి హత్య..

ప్రేమోన్మాదం రెచ్చిపోతుంది. ప్రేమ పేరుతో ఉన్మాదానికి పాలుపడుతున్నారు దుర్మార్గులు.  ప్రేమించలేదని కొందరు,  తను ప్రేమించిన అమ్మాయి ఇంకొకరితో చనువుగా మాట్లాడుతుందని మరికొందరు. పేరు ఏదైతేనేమి  ప్రేమిచిన వారిపైనే దారుణాలకు పాలుపడుతున్నారు. వరుస ఘటనలు జరుగుతున్న, శిక్షలు పడుతున్న కానీ ప్రేమోన్మాధుల్లో మార్పు రాకపోగా ఇంకా బరితెగిస్తూ పోతున్నారు. నరసరావుపేట శివారులో దారుణం చోటు చేసుకుంది. కోట అనూష అనే విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. అనూష స్వస్థలం గుంటూరు జిల్లా ముప్పాళ్ళ మండలం గోళ్లపాడు. కృష్ణవేణి కాలేజిలో డిగ్రీ చదువుతున్న అనూష, విష్ణువర్ధన్ రెడ్డి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. కాగా, అనూష మరొకరితో చనువుగా ఉంటుందని విష్ణువర్ధన్ రెడ్డి అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో అనూషను విష్ణువర్ధన్ రెడ్డి దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని కాలువలో పడేశాడు. అనంతరం విష్ణువర్ధన్ రెడ్డి పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.