అప్రతిహతంగా ముగిసిన నారాలోకేశ్ యువగళం యాత్ర
posted on Dec 19, 2024 4:20PM
రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించే రోజు ఇది. యువగళం నేత మంత్రి నారాలోకేశ్ ఈ యాత్ర చేపట్టి గురువారానికి 3132 కిలో మీటర్లకు చేరుకుంది. కుప్పం నుంచి ఈ యాత్ర ప్రారంభమైంది. 226 రోజుల పాటు యాత్ర కొనసాగింది. గురువారానికి అంటే డిసెంబర్ 19 నాటికి ఈ యువగళం యాత్ర ముగిసింది. ఎపిలోని 97 నియోజకవర్గాలు చుట్టుముట్టింది. యువగళం నేత ఈ యాత్ర ప్రారంభం నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సవాళ్లను స్వీకరించిన నేతగా నిలిచారు. పేదరికం, నిరుద్యోగం, అవినీతి, వైకాపా అవినీతికి వ్యతిరేకంగా యాత్ర సాగింది. పాద యాత్రలో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉంటానని నారాలోకేశ్ ముగింపు వేడుకలో అన్నారు. టిడిపి, జనసేన నేతలు భారీగా ఈ కార్యక్రమానికి తరలిరావడంతో అంగెనపూడి పసుపు సంద్రంగా తయారయ్యింది. ఈ ఏడాది జనవరి 27న యాత్ర ప్రారంభమైంది. చంద్రబాబు చేపట్టిన వస్తున్నా మీ కోసం పాద యాత్ర అంగెనపూడిలో ముగిసింది. అదే సెంటిమెంట్ తో లోకేశ్ కూడా అక్కడే ముగించారు. యువగళం తొలి రోజు నుంచి అప్పట్లో అధికారంలో ఉన్నవైకాపా ప్రభుత్వం అవరోధాలు కలిగించింది. జీవో నెంబర్ 1 అడ్డుపెట్టుకుని అరాచకాలు చేసింది. తారకరత్న మరణం, ఎమ్మెల్సీ ఎన్నికల సమయం, చంద్రబాబు అక్రమ అరెస్ట్ సమయంలో యువగళం యాత్రకు తాత్కాలిక బ్రేక్ పడింది. కుప్పంలో ఈ యాత్ర ప్రారంభమై తంబెళపల్లి చేరుకునే లోపు వైకాపా ప్రభుత్వం నారాలోకేశ్ పై 25 అక్రమ కేసులు బనాయించింది. పోలీసులు, వైకాపా శ్రేణులు తెదాపా శ్రేణులపై కవ్వింపు చర్యలకు పాల్పడ్డాయి. 40 మంది యువగళం వాలెంటీర్లపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. గన్నవరం నియోజకవర్గంలోని 46 మందిపై తప్పుడు కేసులు పెట్టారు. విదేశాల్లో ఉన్న వారిపై కూడా కేసులు నమోదయ్యాయి. అనేక ఆటు పోట్లను అధిగమించిన ఈ యాత్ర ముగిసిన సంధర్భంగా మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.