కేఫ్ లో పేలిన గ్యాస్ సిలెండర్.. ఐదుగురికి తీవ్ర గాయాలు

హైదరాబాద్ లోని క్రెసెంట్ కేష్ అండ్ బేకర్స్ లో సోమవారం తెల్లవారు జామున గ్యాస్ సిలెండర్ పేలింది. ఈ పేలుడులో ఐదుగురు తీవ్రంగా గాయడ్డారు. క్షతగాత్రులలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.  పేలుడులో గాయపడిన వారంతా హోటల్ లో పని చేసేవారే.

సంఘటన జరిగిన సమయంలో హోటల్ లో రష్ పెద్దగా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందంటున్నారు. ఇలా ఉండగా పేలుడు ధాటికి హోటల్ భవనం గోడలు బీటలు వారాయి.  క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించిన అధికారులు, పోలీసులు దుర్ఘటనపై దర్యాప్తు చేపట్టారు.