బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో విచారణకు శ్యామల
posted on Mar 24, 2025 10:29AM

వైసీపీ అధికార ప్రతినిథి, నటి శ్యామల బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో సోమవారం (మార్చి 24) ఉదయం పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. తనపై నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలంటూ ముందు శ్యామల హైకోర్టును ఆశ్రయించారు. ఆమె కేసు విచారించిన హైకోర్టు కేసు క్వాష్ చేయడానికి నిరాకరించింది.
ఈ కేసులో శ్యామలతో పాటు పలువురు నటులు, బుల్లితెర నటులు, యాంకర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లు కూడా ఉన్నారు. అయితే ఎవరూ కోర్టును ఆశ్రయించలేదు. అరెస్టు భయంతో శ్యామల మాత్రమే హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ఇప్పటికే యాంకర్ విష్ణుప్రియ, రీతూ చౌదరిలు పోలీసుల విచారణకు హాజరయ్యారు.
ఈ కేసులో ఉన్నన నటులు విజయ్ దేవరకొండ, రానా, ప్రకాశ్ రాజ్ లు సోషల్ మీడియా వేదికగా వివరణలు ఇచ్చారు. పోలీసులు పిలిస్తే విచారణకు వెళ్లేందుకు సిద్ధమని ప్రకటించారు. వీరిలో వైసీపీ అధికార ప్రతినిథి శ్యామల మాత్రమే హైకోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టు ఆమెపై కేసు క్వాష్ చేయడానికి నిరాకరించింది. దీంతో కోర్టు ఆదేశాల మేరకు ఆమె పంజగుట్ట పోలీసు స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు.