బాత్రూమ్‌లో హీరో పిచ్చిచేష్టలు..తెల్లమొహం వేసిన పోలీసులు

ఒక సినీనటుడు కదులుతున్న రైలులో..అందులోనూ బాత్రూమ్‌లో చేసిన హడావిడికి ఫ్రాన్స్ ఉలిక్కిపడింది. హాలీవుడ్ మూవీలో నటిస్తున్న పర్షియాకు చెందిన ఒక నటుడు మార్సెల్లీ నుంచి ప్యారిస్ వెళ్లే మెట్రో రైలులో ప్రయాణిస్తున్నాడు. అప్పటి వరకు తన సీటులో పద్ధతిగా కూర్చొన్న అతను కొద్దిసేపటి తర్వాత బాత్రూమ్‌లోకి వెళ్లి తుపాకులు, ఆయుధాలు అంటూ ఉగ్రవాదులు ఉపయోగించే పదాలను ఇంగ్లీష్‌లో, డచ్‌ భాషలో పదే పదే పలికాడు. ఇది గమనించిన ప్రయాణీకులకు రైలులో ఉగ్రవాది ఉన్నాడంటూ టీసీకి సమాచారం అందించారు.

 

ఆయన వచ్చిన సమయంలోనూ ఇదే తరహా మాటలు వినిపించడంతో ఉగ్రవాది ఉన్నాడని నిర్థారించుకున్నాడు. వెంటనే రైల్వే పోలీసులు, ఆర్మీ సిబ్బందిని అలర్ట్ చేశాడు. వెంటనే అక్కడికి చేరుకున్న భద్రతా దళాలు నటుడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు విషయం బయటపడింది. ఆయనొక నటుడని ఒక పాత్ర కోసం డైలాగ్స్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు చెప్పాడు. కంపార్ట్‌మెంట్లో డైలాగ్స్ గట్టిగా చదివితే తోటి ప్రయాణికులకు అసౌకర్యంగా ఉంటుందని అందుకే బాత్రూమ్‌లో ఈ పని చేశానని చెప్పడంతో పోలీసులు షాక్‌కు గురయ్యారు. అనంతరం అతడిని విడిచిపెట్టి మీడియాకు సమాచారం అందించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu