తలబొప్పి కడితే కాని....
posted on Sep 27, 2012 8:44AM
.png)
ఫ్రాన్స్ దేశంలో ఇకమీదట అధికారిక పత్రాల్లో ‘పేరెంట్స్’ అనే పదాన్ని మాత్రమే వాడనున్నారు. ఫ్రాన్స్ దేశవ్యాప్తంగా స్వలింగ సంప్కరులు అధికమై ‘గే’ మ్యారేజీలు పెరగటంతో అక్కడి ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయాన్ని తీసుకుంది. త్వరలో అన్ని వివాహ వేడుకల్లో ‘పేరెంట్స్8 అనే పదాన్ని మాత్రమే వినియోగిస్తారు. పిల్లలను దత్తత తీసుకునే హక్కులు సైతం ఆడమగ జంటకు, గే జంటకు సమానంగా ఉంటాయని పేర్కొంది. సృష్టి విరుద్ధంగా ఏం జరిగినా అదేదో ఘనకార్యమని కొందరు దానికి మద్దతు ఇవ్వడం, ఆపైన దాన్ని మరికొందరు అనుసరించడం.. చివరకు సంక్షోభం దిశగా అది అడుగులేసినప్పుడు అప్పుడు ప్రభుత్వాలు కళ్లు తెరచి నివారణ చర్యలు తీసుకోవడం ప్రారంభిస్తారు. ఇది ఇంచుమించుగా ప్రతి దేశంలో జరిగే తంతే. ‘గే’ వంటి ప్రకృతి విరుద్ధ ధర్మాలకు మద్దతు నిచ్చే వ్యక్తులు ఇకనైనా అటువంటి వాటిపై పూర్తిగా ఆలోచించి, అవగాహన చేసుకుని తమ తమ మద్దతును తెలిపితే బావుంటుంది. లేదంటే ఇప్పుడు ఫ్రాన్స్‌లో జరుగుతున్నదే.. రేపు మరో దేశంలో జరగవచ్చు.!