జగన్ పంచన చేరడానికి ఎనిమిది మంది మంత్రులు, 30 శాసన సభ్యుల సన్నాహాలు?
posted on May 26, 2012 3:21PM
రాష్ట్రంలో మారుతున్న పరిణామాల నేపధ్యంలో అవసరం, అవకాశాన్ని బట్టి జగన్ పంచన చేరడానికి ఎనిమిది మంత్రులు, సుమారు 30 మంది శాసన సభ్యులు సిద్ధంగా ఉన్నట్టు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ఒకరు తెలుగువన్ డాట్ కామ్ కు తెలిపారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఈ మాజీ సభ్యుడు తెలుగువన్ డాట్ కామ్ తో మాట్లాడుతూ రాష్ట్రంలో అనూహ్యమైన మార్పులు సంభవించి కిరణ్ కుమార్ సర్కార్ పతనమైనా ఆశ్చర్యపోనక్కరలేదని అన్నారు. మోపిదేవి వెంకట రమణను అరెస్టు చేసిన తర్వాత కిరణ్ మంత్రివర్గ సహచరులు అభద్రతా భావానికి గురవుతున్నారని, శాసనసభ్యులు కూడా కాంగ్రెస్ లో ఉంటే తమకు భవిష్యత్ ఉండదనే అభిప్రాయంతో ఉన్నట్లు ఆయన చెప్పారు.
.jpg)
ఇది ఇలా ఉండగా ఇతర పార్టీలకు చెందిన సీనియర్ నేతలకు కాంగ్రెస్ పార్టీలలో శాసన సభ్యులను వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం కోసం జగన్మోహనరెడ్డి మరోసారి "ఆకర్ష్ పథకం" సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఈ ఆకర్స్ లో భాగంగానే విశాఖ ఎంపి సబ్బం హరి, ఏలూరు శాసన సభ్యులు నాని, బొబ్బిలి శాసన సభ్యులు వి.ఎస్.కె,రంగారావు, మాజీ రాజ్యసభ సభ్యులు మైసూరారెడ్డి వంటివారు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు చెప్పుకొంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానులను ఆకర్షించడానికి ప్రత్యేకంగా దృష్టిపెట్టినట్టు చెబుతున్నారు. కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్ కు వీరాభిమానులుగా వున్న శాసన సభ్యులను తమవైపు తిప్పుకొనే ప్రయత్నంలో కొంతమేరకు విజయం సాధించినట్టు వైఎస్ ఆర్ నేతలు చెప్పుకొంటున్నారు. ఈ నాలుగు జిల్లాల నుంచి కనీసం మరో నలుగురు శాసన సభ్యులు తమవైపు రావడానికి సిద్ధంగా వున్నట్టు వారు చెబుతున్నారు. ఈ నాలుగు జిల్లాల నుంచి కనీసం మరో నలుగురు శాసన సభ్యులు తమవైపు రావడానికి సిద్ధంగా వున్నట్టు వారు చెబుతున్నారు. ఆకర్ష్ పథకం విజయవంటమవుతుందని..... 2014 ఎన్నికలు తమవేనని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.