ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల...
posted on Jan 4, 2017 11:22AM

ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. యూపీ, పంజాబ్, గోవా, ఉత్తరఖండ్, మణిపూర్ లలో ఎన్నికల షెడ్యూల్ ను సీఈసీ నజీం అహ్మద్ జైదీ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... యూపీలో ఏడు విడతల్లో, మణిపూర్లో రెండు విడతల్లో, మిగతా రాష్ట్రాల్లో ఒక విడతలో పోలింగ్ జరగుతుందని.. ఇవాల్టి నుండి ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందని తెలిపారు. మొత్తం ఐదు రాష్ట్రాల్లోని 690 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 16 లక్షల కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని... మొత్తం లక్షా 85 వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని..ఓటింగ్ కేంద్రం వద్ద గుర్తింపు కార్డ్ చూడటం తప్పని సరి అని.. మహిళా పోలింగ్ బూత్ లలో మహిళా ఉద్యోగులే ఉంటారని తెలిపారు.
* పంజాబ్, గోవా రాష్ట్రాల్లో ఒకే విడతలో ఫిబ్రవరి 4న పోలింగ్ జరుగుంది.
* ఉత్తరాఖండ్‌లో ఒకే విడత ఫిబ్రవరి 15న పోలింగ్ జరుతుంది.
* మణిపూర్‌లో రెండు విడదలుగా.. మార్చి 4, మార్చి 8న పోలింగ్ ఉంటుంది.
* పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో ఏడు విడతల్లో పోలింగ్ నిర్వహిస్తారు. ఫిబ్రవరి 11, 15, 19, 23, 27, మార్చి 4, మార్చి 8 తేదీల్లో పోలింగ్ నిర్వహిస్తారు.
* ఐదు రాష్ట్రాల ఎన్నికల కు సంబంధించిన ఓట్ల లెక్కింపు మార్చి 11న ప్రారంభం అవుతంది. అదేరోజు ఫలితాలు వెల్లడవుతాయి.