కవర్ ఫొటో పై ట్రంప్ ఫైర్.. ఇంత చెత్త ఫొటో నా..?

 

డొనాల్డ్ ట్రంప్ తనకు ఏం అనాలనిపిస్తుందో అది అనేస్తారన్న విషయం తెలిసిందే. ఇప్పుడు తన ఫొటోపై కూడా అలాంటి వ్యాఖ్యలే చేశారు ట్రంప్. అసలు సంగతేంటంటే... ప్రముఖ ఇంగ్లీష్‌ వార్తా సంస్థ సీఎన్‌ఎన్‌  ‘అన్‌ప్రెసిడెంటెడ్‌’ అనే పుస్తకంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల గురించి.. ఎన్నికలు జరిగిన తీరు గురించి విశ్లేషిస్తూ ఈ పుస్తకాన్ని విడుదల చేశారు. అయితే ఈ పుస్తకం పై స్పందించిన ట్రంప్ పుస్తకంలో రాసి ఉన్నదాని గురించి ఏం మాట్లాడలేదు కానీ.. పుస్తకం పై ఉన్న కవర్ ఫొటో గురించి మాత్రం స్పందించి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిలో 2016 ఎన్నికలు, విజయానికి సంబంధించిన అంశాలు ఉన్నాయి... బాగా కృషి చేశారనే అనుకుంటున్నా.. కానీ దీని కవర్‌పేజీకి వినియోగించిన నా ఫొటో అస్సలు బాగోలేదు.... నా జీవితంలో ఎన్నడూ చూడని చెత్త ఫొటో అది’ అని పేర్కొన్నారు.

 

కాగా ఈ పుస్తకానికి రెండు వెర్షన్‌లు ఉన్నాయి. తొలిపరిచయ ముద్రణలో బాగా ఉన్న ట్రంప్‌ ఫొటోను వాడారు. మరో ఎడిషన్‌లో మాత్రం ట్రంప్‌ ఫొటోల కొలాజ్‌ను వాడారు. దీనిలో ట్రంప్‌ వేదికపై మాట్లాడుతున్న ఒక ఫొటోను కూడా వాడారు. వీటిల్లో ఏ ఫొటోను ఉద్దేశించి ట్రంప్‌ వ్యాఖ్యానించారో తెలియరాలేదని సంస్థ అధికారులు తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu