ఆంధ్రప్రదేశ్ లో ‘త్రీ సర్వీస్ ఎట్ డోర్ స్టెప్‘
posted on Nov 3, 2015 12:50PM

త్రీ సర్వీస్ ఎట్ డోర్ స్టెప్ పేరిట ప్రతి ఇంటికీ ఇంటర్నెట్, వీడియో, టెలీఫోన్ సేవలను అందించే ఫైబర్ గ్రిడ్ పనులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేగవంతం చేసింది, 2016 మార్చికల్లా రాష్ట్రంలో ప్రతి ఇంటికీ ఈ సర్వీసులను అందుబాటులోకి తేవాలనుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.... ఫైబర్ గ్రిడ్ పనులపై సమీక్ష నిర్వహించారు, ఫైబర్ గ్రిడ్, ఇన్ క్యాప్, విద్యుత్ శాఖ అధికారులతో సమావేశమైన చంద్రబాబు....వచ్చే ఏడాదిలోపు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఈ ఏడాది డిసెంబర్ నాటికే పనులు పూర్తిచేయాలన్న చంద్రబాబు... మిగిలిన పది జిల్లాల్లో 2016 మార్చికల్లా కంప్లీట్ చేయాలని అధికారులకు సూచించారు. దేశంలోనే మొట్టమొదటిగా ఫైబర్ గ్రిడ్ పనులను చేపట్టిన ఘనత ఆంధ్రప్రదేశ్ కే దక్కుతుందన్న ముఖ్యమంత్రి.... 333 కోట్ల రూపాయలతో తొలి దశ ప్రాజెక్టును చేపడుతున్నట్లు వివరించారు. ఈ ప్రాజెక్టును సమర్ధవంతంగా పూర్తిచేయడానికి విద్యుత్ శాఖ, ఇన్ క్యాప్, ఫైబర్ గ్రిడ్ ... అధికారులు సమన్వయంతో పనిచేయాలని బాబు సూచించారు.
ఫైబర్ గ్రిడ్ కేబుల్స్ ను భూఉపరితలం మీద నుంచే వేయనున్నారు, సుమారు 3.5 లక్షల విద్యుత్ స్థంభాల మీదుగా 30 వేల కిలోమీటర్ల పొడవునా కేబుల్స్ వేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అంతేకాదు 2500 సబ్ స్టేషన్లు, విద్యుత్ స్థంభాలను జీపీఎస్ మ్యాపింగ్ చేస్తూ... ఫైబర్ గ్రిడ్ కేబుల్స్ వేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టులో దాదాపు 2600 పాయింట్ ఆఫ్ ప్రజెన్స్ ను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని అధికారులు ప్రకటించారు.