హైదరాబాద్ లో నకిలీ ఐపీఎస్‌ అధికారి అరెస్టు

హైదరాబాద్ లో  ఐపీఎస్‌ అధికారినంటూ మోసం చేసిన శ్రుతిసిన్హా అరెస్టు అయింది. నిందితురాలిని బాచుపల్లి పోలీసులు అరెస్టు చేశారు. వీరారెడ్డి అనే వ్యక్తి నుంచి 11 కోట్ల రూపాయలను శ్రుతి సిన్హా కొల్లగొట్టింది. తన చెల్లితో వీరారెడ్డి సోదరుడికి వివాహం జరిపిస్తాని చెప్పి... పెళ్లి పేరుతో వీరారెడ్డి వద్ద రూ.11 కోట్లు వసూలు చేసింది. బంధువు విజయ్‌కుమార్ రెడ్డితో కలిసి శ్రుతి  మోసం చేసింది. 

వసూలు చేసిన డబ్బుతో శ్రుతి సిన్హా ఖరీదైన కార్లు కొనుగోలు చేసింది. మోసపోయానని గ్రహించిన వీరారెడ్డి  పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు విషయం తెలిసి శ్రుతి బంధువు విజయ్‌కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. నకిలీ ఐపీఎస్‌ అధికారి పేరుతో చేసిన మోసం కేసులో మహిళకు సహకరించిన ముగ్గురిని బాచుపల్లి పోలీసులు అరెస్టు చేశారు. నిందితురాలి వద్ద 3 కార్లు, రూ.6 కోట్ల విలువైన ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు.