రంజాన్ వేళ పొలిటీషియన్లకు ఈసీ షాక్

రంజాన్ పండగ వేళ తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రులకు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది.  హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో  ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు రంజాన్ వేడుకల్లో పాల్గొనడానికి అనుమతి లేదని ఈసీ పేర్కొంది.  

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉండడంతో ఈసీ ఈ ఆంక్షలు విధించింది. ఈ మేరకు ఎన్నికల సంఘం ఒక ప్రకటన విడుదల చేసింది. దీంతో కోడ్ కారణంగా రంజాన్ వేడుకలలో ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిథులు పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. ఏటా రంజాన్ మాసంలో ప్రభుత్వం అధికారికంగా ఇఫ్తార్ విందు ఇవ్వడం ఆనవాయితీ. అలాగే  రాజకీయ పార్టీలు,   నేతలూ కూడా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తుంటారు. ఎన్నికల కోడ్ పుణ్యమా అని ఈ సారి ఇక నుంచి అందుకు అవకాశం లేకుండా పోయింది.