నైట్ రైడర్స్ మ్యాచ్‌కి రాములోరి బ్రేక్.. !
posted on Mar 29, 2025 10:21PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు శ్రీరాముడు చిన్నబ్రేక్ వేశారు. శ్రీరామనవమి ఎఫెక్ట్‌తో ఒక మ్యాచ్ పోస్టు పోన్ అయింది. ఐపీఎల్ హైటెన్షన్ మ్యాచులతో ఉర్రూత లూగిస్తోంది లాస్ట్ ఓవర్ థ్రిల్లర్స్, భారీ స్కోర్లు.. వెరసి అభిమానులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ పంచుతోంది. ఈ తరుణంలో ఐపీఎల్ షెడ్యూల్‌లో సడన్ చేంజెస్ చేసింది బీసీసీఐ. అయితే అదేమంత పెద్ద మార్పు కాదనీ, కేవలం ఒక మ్యాచ్ విషయంలో మాత్రమే మార్పు చోటుచేసుకుందని ఐపీఎల్ నిర్వాహకులు తెలిపారు.
ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ టీమ్స్ మధ్య ఏప్రిల్ 6వ తేదీన మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే అదే రోజు శ్రీ రామ నవమి కావడంతో కోల్‌కతాలో భారీ ఉత్సవాలు నిర్వహించనున్నారు. దీంతో సెక్యూరిటీ ఇష్యూస్ తప్పవని, ఫుల్ ప్రొటెక్షన్ కల్పించలేమని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్‌కు కోల్‌కతా పోలీసులు స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో షెడ్యూల్‌లో చేంజెస్ చేసింది బీసీసీఐ. ఏప్రిల్ 8వ తేదీన అదే ఈడెన్ గార్డెన్స్‌లో మధ్యాహ్నం 3.30 గంటలకు నిర్వహిస్తామని స్పష్టం చేసింది. దీంతో ఏప్రిల్ 6న డబుల్ హెడర్ స్థానంలో కేవలం సన్‌రైజర్స్ హైదరాబాద్-గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్‌లో పైఒక్క మ్యాచ్‌లో తప్పితే ఇతర మార్పులేవీ లేవు.