మణిపూర్ లో కంపించిన భూమి
posted on Mar 29, 2025 4:42PM
.webp)
మయన్మార్ లో శుక్రవారం( మార్చి 28) సంభవించిన భారీ భూకంపం అనంతరం అదే రోజు మణిపూర్ లో భూమి కంపించింది. ఆ తరువాత శనివారం (మార్చి 29) మధ్యాహ్నం కూడా మరోసారి భూమి కంపించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.8గా నమోదైంది. ఈ భూకంప కేంద్రం భూమికి పది కిలోమీటర్ల లోతున ఉన్నట్లు భూకంప కేంద్రం తెలిపింది. ఈ భూకంపం కారణంగా ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. ఇలా ఉండగా శుక్రవారం మయన్మార్, బ్యాంకాక్ లను కుదిపేసిన భూకంపం కారణంగా వేయి మందికిపైగా మరణించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఒక మయన్మార్ లోనే మృతుల సంఖ్య 1002లో అక్కడి అధికారులు ధృవీకరించారు. ఇంకా వందల మంది శిథిలాల కింద చిక్కుకుని ఉండొచ్చని అంటున్నారు.
దీంతో మృతుల సంఖ్య భారీగా పేరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తం అవుతున్నది. కాగా బ్యాంకాక్ లో భూకంప సమయంలో ఒక మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. భూకంప సమయంలో బ్యాంకాక్ లోని బీఎన్ హెచ్, కింగ్ చులాలాంగ్ కార్న్ మెమోరియల్ ఆస్పత్రుల నుంచి రోగులను సమీపంలోని పార్క్ కు తరలించారు. ఆ పార్కులో, బహిరంగ ప్రదేశంలోనే ఓ మహిళ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ మహిళ స్ట్రేచ్చర్ పై పడుకుని ఉండగా ఆస్పత్రి సిబ్బంది ఆమెకు ప్రసవం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియలో సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతోంది.