తెలంగాణావో నకిలీగుట్కాల తయారి?

పలురాష్ట్రాల్లో అసలుకు, నకిలీకి తేడా లేకుండా తయారు చేస్తున్న నకిలీగుట్కాల రవాణాకు ఆంధ్రప్రదేశ్‌ అడ్డాగా మారుతోంది. గుట్కాను, దాని ప్యాకింగ్‌ కవర్లను తెచ్చి నకిలీ ప్యాకెట్లు తయారు చేస్తున్నారని, తెలంగాణా ప్రాంతంలో రహస్యంగా ఈ నకిలీగుట్కా తయారీ ప్రారంభమైందని సమాచారం. తయారైన గుట్కాప్యాకెట్లను మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలకు సప్లయ్‌ చేస్తున్నారని  తెలిసింది. ఈ కార్యకలాపాల్లో ఎక్కువగా పాల్గొనేది కలకత్తా నుంచి ఆంథ్రప్రదేశ్‌కు వలస వచ్చినవారేనని తెలుస్తోంది. వీరు కూలీల సహాయంతో ప్యాకింగ్‌ చేసి నకిలీగుట్కాలను పలు రాష్ట్రాల్లో అమ్మకాలు సాగిస్తున్నారని ఆరోపణలున్నాయి.



ప్రత్యేకించి కోట్లాది రూపాయల వ్యాపారం చేస్తున్న ఈ ముఠా కార్యకలాపాలు రోజురోజుకు విస్తరిస్తున్నాయని   తెలుస్తోంది. తాజాగా అదిలాబాద్‌ జిల్లా భైంసా పట్టణం నుంచి కబీరు మీదుగా మహారాష్ట్రలోని హిమాయత్‌నగర్‌ జిల్లా సోన్‌పట్టణానికి మూడు లక్షల రూపాయల విలువైన గుట్కాను రవాణా చేస్తున్న లారీని పోలీసులు స్వాధీనపర్చుకున్నారు. దాని డ్రైవర్‌కు కోర్టు రిమాండు విధించింది. వాహనానికి సరైన అనుమతి లేకుండానే తీసుకువెళుతుండగా తాము పట్టుకున్నామని ఎస్‌ఐ తోట సంజీవ్‌ తెలిపారు. ఇలానే ఇటీవల ఆంథ్రప్రదేశ్‌ నుంచి వచ్చిన నకిలీగుట్కా లారీని మహారాష్ట్ర పోలీసులు పట్టుకున్నారు. అప్పుడే నకిలీగుట్కా వ్యవహారం కొంత వెలుగులోకి వచ్చింది.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu