జగన్‌కు మేలు చేస్తున్న కిరణ్‌కుమార్‌

రాష్ట్రముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పరోక్షంగా వై.కా.పా.అధినేత జగన్‌కు మేలు చేస్తున్నారు. 26 వివాదస్పద జీఓల జారీపై కిరణ్‌కుమార్‌రెడ్డి తన మంత్రి వర్గ సహచరులను వెనుకేసుకురావటం పరోక్షంగా జగన్‌కు ఉపయోగపడబోతోంది.  జగన్‌పై విచారణ చేపట్టాలని రాష్ట్ర హైకోర్టు , వివాదస్పద జీఓలు జారీ చేసినందుకు ఆరుగురు మంత్రులపై విచారణ జరపాలని సుప్రీంకోర్టు సిబిఐను ఆదేశించాయి. ఈ రెండు కేసులకు చాలా సారుప్యత ఉంది. ఈ రెండు కూడా జగన్‌ అక్రమాస్తుల కేసులకు ముడిపడి ఉన్నవే. అయితే జీఓల జారీ కేబినెట్‌ సమిష్టి నిర్ణయమని, కిడ్‌ప్రోకోలో మంత్రులెవరికీ ప్రమేయం లేదని, కిరణ్‌కుమార్‌రెడ్డి బహిరంగంగా ప్రకటించారు.




దీంతో ఆయన తన మంత్రివర్గ సహచరులకే కాకుండా జగన్‌కు కూడా క్లీన్‌చిట్‌ ఇచ్చినట్లు అయింది. దివంగత వైఎస్‌ కూడా అప్పటి కేబినెట్‌లో భాగమేనని, అందువల్ల కిరణ్‌కుమార్‌ ప్రకటన ఆయనకు కూడా వర్తిస్తుందని, వైఎస్‌ కూడా కిడ్‌ప్రోకో కింద లబ్ది పొందలేదని భావించాల్సి ఉంటుందని వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ నాయకులు అంటున్నారు. అంతేకాక కోర్టులో కూడా జగన్‌ లాయర్లు ఈ ప్రకటనను చూపి తమ క్లయింట్‌ అమాయకుడని చెప్పడానికి ప్రయత్నించబోతున్నారు.  కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన ప్రకటన తన మంత్రివర్గ సహచరులతో పాటు జగన్‌కు కూడా ఊరట కలిగించే పరిస్థితి ఏర్పడిరది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu