అంతకు మించి ఖర్చు పెడితే అంతే...
posted on Jan 4, 2017 12:10PM
.jpg)
యూపీ, పంజాబ్, గోవా, ఉత్తరఖండ్, మణిపూర్ రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేశారు సీఈసీ నజీం అహ్మద్ జైదీ. అయితే ఈ ఎన్నికలకు సంబంధించి ఆయన పలు షరతలు సూచించారు నాయకులకు. ముఖ్యంగా ఎన్నికల ఖర్చు గురించి. ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్ లో పోటీ పడుతున్న అభ్యర్థులు రూ. 28 లక్షలకు మించి ఖర్చు పెట్టాడానికి వీల్లేదని... ఎన్నికలకు పెడుతున్న ఖర్చు విషయంలో తేడా వస్తే ఊరుకునేది లేదని ఎన్నికల కమిషన్ హెచ్చరించింది. గోవా, మణిపూర్ రాష్ట్రాల అభ్యర్థులు రూ. 20 లక్షలు మాత్రమే వెచ్చించాలని ఆదేశించింది. అంతకుమించి వెచ్చిస్తే, అనర్హత సహా అన్ని రకాల చర్యలూ తీసుకుంటామని హెచ్చరించింది. ఎన్నికల్లో ఎలాంటి డ్రగ్న్ పంపిణీ జరుగకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నామని పేర్కొంది.