కోవిడ్ వచ్చి తగ్గిన వారిలో ఈ ప్రమాదం ఎక్కువగా ఉందట!
posted on Apr 12, 2023 2:34PM
మనషుల్ని వేధించే ఆరోగ్య సమస్యలలో ఎన్నో ఉన్నాయి. వాటిలో పార్కిన్సన్స్ వ్యాధి కూడా ఒకటి. పార్కిన్సన్స్ వ్యాధి మెదడులోని కొన్ని భాగాలలో ఏర్పడే రుగ్మత, ఇది శారీరక, మానసిక ఆరోగ్యాన్ని చాలా ప్రభావితం చేస్తుంది. సాధారఁంగా ఉన్న జీవితాన్ని ఒక్కసారిగా కుదుపుకు లోనుచేస్తుంది. 2016 సంవత్సరపు గణాంకాల ప్రకారం, దేశంలో సుమారు 6 లక్షల మంది ఈ వ్యాధి బారిన పడ్డారు, అయితే అప్పటికంటే కూడా కరోనా తర్వాత, పార్కిన్సన్స్ కేసులలో వేగంగా పెరుగుదల కనిపించండం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. పార్కిన్సన్స్ వ్యాధిలో నడకలో మార్పు రావడం, దేనినైనా పట్టుకోవడం కష్టమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఈ సమస్య నివారణ, అవగాహన కోసం ప్రతి కృషి చెయ్యాలి.
2019 చివరిలో ప్రారంభమైన కరోనా యొక్క దుష్ప్రభావాలు పార్కిన్సన్స్ వ్యాధి కేసులను మరింత పెంచాయని పరిశోధకులు కనుగొన్నారు. సాధారణంగా ఇది ఒకప్పుడు వృద్ధాప్య సమస్యగా పరిగణించబడేది, అయితే కరోనా మహమ్మారి తర్వాత అయోమయం, జ్ఞాపకశక్తి కోల్పోవడం, శరీర భంగిమలో అసమతుల్యత వంటి పార్కిన్సన్స్ వ్యాధి యొక్క నాడీ సంబంధిత లక్షణాలు ప్రజలలో ఎక్కువగా కనిపిస్తున్నాయి.
కోవిడ్ వైరస్ కారణంగా మెదడు కేంద్ర నాడీ వ్యవస్థను ప్రభావితం అయ్యాయి. ఈ అంటువ్యాధి తరువాత, పార్కిన్సస్స్ కేసులు పెరిగాయి. ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు నిర్వహించిన ఈ అధ్యయనంలో , SARS-CoV-2 వైరస్ పార్కిన్సన్స్ వ్యాధి సమయంలో మెదడులో జరిగే మార్పులను కనుగొన్నారు. వైరస్ ప్రభావం కారణంగా మెదడులో తాపజనక ప్రతిస్పందనను ప్రేరేపిస్తుందని కనుగొన్నారు. మెదడులోని మైక్రోగ్లియా అనే రోగనిరోధక కణాలపై కరోనా వైరస్ ప్రభావం చూపుతుందని పరిశోధనలో తేలింది. ఈ కణాలు సాధారణంగా పార్కిన్సన్స్ వ్యాధిలో అతిగా చురుగ్గా పనిచేస్తాయి మరియు తాపజనక రసాయనాలను ఉత్పత్తి చేస్తాయి. కాబట్టి కోవిడ్ వచ్చినవారు ఈ వ్యాధి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
పార్కిన్సన్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?
ఇప్పటి వరకు పార్కిన్‌సన్ వ్యాధి రావడానికి సరైన కారణం తెలియరాలేదని, దానికి నిర్దిష్టమైన చికిత్స ఏమీ లేదని పరిశోధకులు చెబుతున్నారు. క్రమం తప్పకుండా ఏరోబిక్ వ్యాయామం చేయడం, ఆహారంలో యాంటీఆక్సిడెంట్ల పరిమాణాన్ని పెంచడం వల్ల ఈ వ్యాధి ప్రమాదాన్ని తగ్గించవచ్చని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పార్కిన్సన్స్ వ్యాధి పెరుగుతోంది, దీనిపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యకరమైన అలవాట్లు, మంచి పోషకాహారం, మంచి నిద్ర, శారీరక వ్యాయామంతో పాటు మానసికంగా దృఢంగా ఉండటానికి ప్రయత్నం చెయ్యాలి. ఇందుకోసం ధ్యానం, ప్రాణాయామం చక్కగా పనిచేస్తాయి. నాడీవ్యవస్థను బలోపేతం చేసే చిట్కాలు పాటించాలి.
◆ నిశ్శబ్ద