సలీం vs రాజ్‌నాథ్: లోక్‌సభలో గందరగోళం
posted on Nov 30, 2015 3:17PM
లోక్‌సభలో అసహనం అంశంపై చర్చ మొదలైన వెంటనే గందరగోళ వాతావరణం నెలకొంది. సభలో చర్చను మొదలుపెట్టిన సీపీఎం ఎంపీ సలీం చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. 800 సంవత్సరాల తర్వాత ఒక హిందూవు ప్రధాని అయ్యారని రాజ్ నాద్ సింగ్ వ్యాఖ్యానించారని ఆయన చెప్పడంతో ఒక్కసారిగా బీజేపీ నేతలు మండిపడ్డారు. వెంటనే రాజ్ నాద్ సింగ్ కూడా ఈ వ్యాఖ్యలను ఖండించారు. అయితే సలీం తనవాదనకు కట్టుబడి మాట్లాడారు.తాను అవుట్ లుక్ పత్రికలో వచ్చిన విషయాన్నే చెబుతున్నానని, ఒకవేళ రాజ్ నాద్ ఆ మాటలు అనకపోతే , ఆ విషయాన్ని అవుట్ లుక్ ఎడిటర్ తో మాట్లాడుకోవాలని సలీం సూచించారు. కాగా.. మహ్మద్ సలీం చేసిన వ్యాఖ్యలకు తాను తీవ్రంగా మనస్తాపం చెందానని, తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రాలేదని రాజ్‌నాథ్ సింగ్ తన ప్రసంగంలో చెప్పారు.