సజ్జల, కారుమూరి మస్తుగా మింగేశారు!

జగన్ అనకొండలాగా అందినకాడికి మింగేస్తుంటే, ఆయన ఆస్థానంలోని కొండచిలువలు ఊరకే ఉంటాయా? వాటికి సాధ్యమైంత అవి కూడా మిగేస్తాయి. జగన్ ఆస్థానంలో వున్న సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు పిల్ల సజ్జల, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు నెల్లూరు జిల్లాలో అక్రమ మైనింగ్‌తో వెయ్యి కోట్లు గుటుక్కుమనిపించేశారు. ఈ బడా స్కామ్‌ని సైదాపూరం మైనింగ్ భూముల యజమాని బద్రీనాథ్ వెలుగులోకి తెచ్చారు. ఈ మేరకు ఆయన ఈ కొండచిలువల మీద సీఐడీకి ఫిర్యాదు చేశారు. 

అన్ని అనుమతులూ వున్నతన భూముల్ని లాక్కుని, మైనింగ్‌ చేసి వేల కోట్ల విలువైన క్వార్జ్‌ను విదేశాలకు తరలించారని నెల్లూరు సీఐడీ డీఎస్పీకి బద్రీనాథ్ ఫిర్యాదు చేశారు. 

సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు సజ్జల భార్గవ్, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుతో పాటు స్థానిక వైసీపీ నేతలు దోపిడీ వెనక ఉన్నారని ఫిర్యాదులో ఆరోపించారు.

 లక్షా యాభైవేల టన్నుల క్వార్జ్.ని తవ్వేసి దగ్గరర దగ్గరగా వెయ్యి కోట్ల రూపాయలు దోపిడి చేశారని ఆరోపించారు.

 ఇదేంటని నిలదీస్తే కేసులు పెడుతామని బెదిరించినట్లు తెలిపారు. దీనిపై అప్పట్లో హైకోర్టులో కేసు వేసినప్పటికీ కోర్టు ఆదేశాలను సైతం ధిక్కరించి అక్రమంగా తవ్వకాలు జరిపారని ఆరోపించారు. ఇప్పటికైన వారిపై చర్యలు తీసుకోవాలని క్వార్జ్‌ గనుల యజమాని బద్రీనాథ్ డిమాండ్ చేశారు.

‘‘నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలోని జోగుపల్లిలో 240 ఎకరాల్లో గనులు ఉన్నాయి. దానికి చట్ట బద్దంగా అన్ని అనుమతులు ఉన్నాయి. కానీ స్థానిక వైసీపీ నాయకులతో పాటు రాష్ట్ర స్థాయిలో పెద్ద నేతలు బెదిరించి మైనింగ్‌ని చేజిక్కించుకుని రెండేళ్లుగా వందల కోట్ల విలువైన క్వార్జ్‌ని తవ్వేసి అమ్ముకున్నారు. ఇదేంటని నిలదీస్తే కేసులు పెడుతామని బెదిరించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చినందున అక్రమాలపై ధైర్యంగా ఫిర్యాదు చేశాను." అని సైదాపురం మైనింగ్‌ భూముల యజమాని బద్రీనాథ్  చెబుతున్నారు.