వేసవి కాలంలో కంటి సమస్యలు...

వేసవి కాలం లో అధిక ఉష్ణోగ్రతల కారణంగా శరీరం డీ హైడ్రేషన్ వస్తుంది.కంటి సంభందిత సమస్యలు వస్తూ ఉంటాయి. వేసవి గాలులు అధిక ఉష్ణోగ్రతలు,కాలుష్యం వంటివి మన ఆరోగ్యాన్నే కాదు కంటి పై తీవ్రప్రభావం చూపుతాయని రకరకాల సమస్యలకు కారణం అవుతాయి.వీటి గురించి తెలుసుకుందాం. వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు శరీరం లో నీటి శాతం తగ్గడం వల్ల డీ హైడ్రేషన్ ప్రభావం చూపుతుంది.అది మన ఆరోగ్యం పైనే కాదు  కంటి పై ప్రభావం చూపుతుందని అది మనకంటిలో రక రకాల సమస్యలకు గురిచేస్తుందని అవి ఎంత ప్రమాదమో మనం తెలుసుకుందాం.

కంటిలో మంట...

కంటిలో మంట కు కారణం సీడ్రెన్ విషపూరిత రసాయనం అయ్యి ఉండవచ్చు.అది గాలిలో ఉండి ఉండవచ్చని అది కంటిని ప్రభావితం చేస్తుంది.

కన్జేక్టివైటిస్ -కళ్ళకలక...

కళ్ళకలక కు కారణం బ్యాక్టీరియా అది ఫంగల్ ఇన్ఫెక్షన్,వైరల్ ఇన్ఫెక్షన్,అయ్యి ఉండవచ్చు. వాతావరణం లో సహజంగా వచ్చే సమస్యే కళ్ళకలక ఒకవ్యక్తి నుండి మరో వ్యక్తికి సోకుతుంది.కళ్ళకలక వల్ల కళ్ళు ఎర్రగా చింత నిప్పులాగా ఎర్రగా ఉండడం దురద,కంట్లోనుంచి నీరు కారుతూ ఉంటుంది.

ఎలర్జీ సమస్యలు...

ఈ వాతావరణం లో ఎలర్జీ చాలా సహజ మైన సమస్య కంట్లో దురద,మంట ఎర్రటి ఎరుపు వస్తుంది.దీనికి కారణం వాతావరణం కాలుష్యం అధిక ఉష్ణో గ్రతల్లో బయటికి రావడం వల్ల కంటికి ప్రమాదమే. అని నిపుణులు వైద్యులు సూచించారు. 

కార్నియల్ బర్న్...

వేసవిలో ఎండలో ఎక్కువసేపు గడపడం వల్ల కార్నియల్ బర్న్ సమస్యలు వస్త్ర్హాయి.కంటికి సంబందించిన సమస్యలో దురద కనిపిస్తుంది. కళ్ళలో నీరు ఇంకి పోయి కళ్ళు ఎందిపోయినట్లుగా కనిపిస్తుంది.దీనినే కంటి తడి ఆరిపోవడం అంటారు.

డ్రై అయిస్...

శరీరానికి అవసరమైన మేర నీరు తాగక పోవడం వల్ల వాతావరణం లో చాలా త్వరగా డీ హైద్రేడ్ సమస్యలు వస్తాయి. శరీరం తో పాటు కంటి పై కూడా దీనిప్రభావం చూపిస్తుంది.కళ్ళు పూర్తిగా ఎండిపోయి నట్లు ఉంటుంది.అది మనకు తీవ్ర ఇబ్బందికి గురి  చేస్తుంది.

స్టాయి...

స్తాయీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కంటి రెప్పలు వాచి ఉంటాయి.కళ్ళు ఎర్రగా ఉంటాయి.కంటి పై ఎక్కువ భారం పెట్టకండి బయటి కారణాల  వల్ల కంటిని రక్షించుకో వలసిన అవసరం ఉంది.బయటి కారణాల వల్ల కంటిని రక్షించుకోవాల్సి వచ్చినప్పుడు ముఖ్యంగా ఎండలో ఉన్నప్పౌడు చలువ కళ్ళద్దాలు వాడాలి.ఇలాంటి ఉపాయాలు సమస్యల నుండి కొంత మేర ఉపసమనం కల్పించ వచ్చు.