మన్మోహన్‌కి సమన్లు

 

మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పదవి పోయినప్పటికీ, ఆ పదవిలో వున్నప్పుడు తగిలించుకున్న బొగ్గు మరకలు మాత్రం పోవడం లేదు. బొగ్గు కుంభకోణం విషయంలో మన్మోహన్‌ సింగ్‌ని సీబీఐ ఇప్పటికే ప్రశ్నించిన విషయం తెలిసిందే. అసలే ఆ అవమాన భారంతో వున్న మన్మోహన్‌ సింగ్‌కి మరో షాక్ తగిలింది. బొగ్గు కుంభకోణం విచారణలో నిందితుడిగా వున్న ఆయన ఏప్రిల్ 8వ తేదీన విచారణకు హాజరు కావాలని ఈ కేసును విచారిస్తున్న సీబీఐ ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. మన్మోహన్ సింగ్ ఈ సమన్లు అందుకున్నారు. మరి విచారణకు హాజరు అవుతారో లేదో చూడాలి. మన్మోహన్ సింగ్‌తోపాటు బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి పీసీ ప్రకాష్, పారిశ్రామికవేత్త కుమారమంగళం బిర్లాతోపాటు మరో ముగ్గురికి కూడా సీబీఐ ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది.