సూటుకేసుల్లో డబ్బుల్లేవ్ చేయడానికి.. కేసీఆర్
posted on Oct 3, 2015 1:24PM
తెలంగాణ అసెంబ్లీలో రైతు ఆత్మహత్యలపై.. రైతు రుణమాఫీలపై చర్చ వాడి వేడిగా సాగుతుంది. ఈ సందర్భంగా కేసీఆర్ ఒకింత అసహనానికి గురైనట్టు తెలుస్తోంది. రైతు రుణమాఫీల విషయంపై చర్చజరుగుతన్న నేపథ్యంలో ఒకేసారి రైతు రుణమాఫీలు చేయాలంటే కష్టం.. ప్రభుత్వం దగ్గర సూటుకేసుల్లో డబ్బులుండవు.. నల్ల డబ్బు అంతకంటే ఉండదు అని వ్యాఖ్యానించారు. మొత్తం రాష్ట్రంలో 36 లక్షల రైతు ఖాతాలున్నాయి.. వీరందరికీ లక్ష రూపాయల లోపు ఒకేసారి రుణమాఫీ చేయాలంటే రూ.8 వేల కోట్లు అవసరమవుతాయి.. ఇంత పెద్ద మొత్తంలో రుణమాఫీ చేయాలంటే ప్రభుత్వానికి కష్టతరమైనది అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ.. వాణిజ్య పన్నుల ద్వారా రూ.3500 కోట్లు.. కేంద్ర ప్రభుత్వం ద్వారా 14వ ఫైనాన్స్ కమిషన్ నుంచి అదనంగా రూ.3500 కోట్లు.. ప్రభుత్వ స్థలాలను త్వరలో విక్రయించడం ద్వారా మరో రెండు మూడు వేల కోట్లు నిధులు రావాల్సి ఉంది అవన్నీ వచ్చిన వెంటనే మొదట రుణమాఫీకే ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు.