విశాఖ శారదా పీఠంలో జగన్... ముగిసిన రాజశ్యామల యాగం  

విశాఖలోని శ్రీ శారదాపీఠానికి జగన్ వెళ్లారు. శారదాపీఠం వార్షికోత్సవ వేదుకల్లో ఆయన పాల్గొన్నారు. శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతితో కలిసి రాజశ్యామల అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు తీసుకున్నారు. శారదాపీఠంలో జరిగిన రాజశ్యామల యాగం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. మరోవైపు శారదాపీఠం వద్ద జగన్ కు బొత్స సత్యనారాయణ, ధర్మాన కృష్ణదాస్ తదితరులు స్వాగతం పలికారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల కోలాహలం నెలకొంటోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెెడ్డి.. రాజశ్యామల యాగానికి హాజరయ్యారు. విశాఖ శ్రీ శారదా పీఠం వేదికగా అయిదు రోజుల పాటు జరగబోయే ఈ ఉత్పవాల్లో పాల్గొన్నారు.
చినముషిడివాడలో గల విశాఖ శ్రీ శారదా పీఠం వార్షికోత్సవాలు ప్రతి సంవత్సరం ఏర్పాటవుతుంటాయనే విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా వీటిని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ నెల 21వ తేదీన రాజశ్యామల యాగంతో శారదా పీఠం వార్షికోత్సవాలు ముగిసాయి. ముగింపు కార్యక్రమానికి వైఎస్ జగన్ హాజరయ్యారు. . పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి పర్యవేక్షణలో జరిగే రాజశ్యామల యాగంలో భాగస్వామ్యులయ్యారు. . లలితాంబికా అమ్మవారిని సందర్శిస్తారు. గోపూజ, శమీవృక్ష పూజల్లో పాల్గొన్నారు.