చంద్రబాబు.. లగడపాటి భేటీ.. ఆంతర్యం ఏమిటో?


 


రాష్ట్రం విడిపోతే తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పి.. చెప్పిన మాట ప్రకారం నిజంగానే రాజకీయాలకు దూరంగా ఉన్నారు విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్. రాష్ట్రం విడిపోయి దాదాపు 15 నెలలు పైనే అయిపోయింది. అప్పటినుండి ఇప్పటి వరకూ లగడపాటి పెద్దగా కనిపించిన దాఖలాలు లేవు. అయితే ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం లోకి మారబోతున్నారనే హాట్ టాపిక్ నడుస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. లగడపాటి రాజగోపాల్ ఇద్దురు భేటీ అయిన నేపథ్యంలో పలు అనుమానాలు రేకెత్తున్నాయి. సింగపూర్ పర్యటన అనంతరం  చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమైన సంగతి తెలిసిందే.. దీనిలో భాగంగానే ఆయన లగడపాటిని కూడా కలవడం జరిగింది. దీంతో చంద్రబాబు లగడపాటిని ఎందుకు కలిశారు.. వారి భేటీ వెనుక ఆంతర్యమేంటి? అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఈ భేటీలో చంద్రబాబుతోపాటు ఏపీ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ రావు, విజయవాడ ఎంపీ కేశినేని నానిలు ఈ సమావేశంలో పాల్గొన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ భేటీలో ఎలాంటి రాజకీయ పరమైన అంశాలపై చర్చ జరగలేదని.. కేవలం వ్యాపార అంశాలమీద చర్చించామని తెలుపుతున్నారు. ఏదీ ఏమైన చంద్రబాబు.. రాజగోపాల్ దేని నిమిత్తం భేటీ అయిన రాజగోపాల్ టీడీపీలో చేరే నేపథ్యంలోనే చంద్రబాబును కలిశారని వార్తులు వినిపిస్తున్నాయి.