మోదీకి చంద్రబాబు లెట‌ర్‌.. లేఖలో ఏముందో తెలుసా?

ప్ర‌ధాని మోదీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. వెంట‌నే బీసీ జన గణన చేపట్టాలని కోరారు. సరైన సమాచారం అందుబాటులో లేకపోవడంతో బీసీలకు అన్యాయం జరుగుతోందని ప్ర‌ధాని దృష్టికి తీసుకొచ్చారు. సంక్షేమ పథకాలు అమలు చేసినా ఆయా వర్గాలు ఇంకా వెనకబడే ఉంటున్నాయని తెలిపారు. 

బీసీ జనగణన జరిగితేనే ఆ వ‌ర్గానికి సంక్షేమ ఫలాలు అందుతాయని లేఖ‌లో చంద్ర‌బాబు అభిప్రాయ‌ప‌డ్డారు. బీసీ జనగణనపై టీడీపీ ప్రభుత్వ హయాంలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించామ‌ని గుర్తు చేశారు. ఇప్పుడు అందుబాటులో ఉన్న‌ కులాల వారీ వివరాలు 90 ఏళ్ల నాటివని.. ఆ లెక్క‌ల‌తో బీసీల‌కు సంక్షేమ ప‌థ‌కాలు అంద‌డంలో తీవ్ర అన్యాయం జ‌రుగుతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కేంద్ర ప్ర‌భుత్వం ఆల‌స్యం చేయ‌కుండా దేశ వ్యాప్తంగా బీసీ జ‌న గ‌ణ‌న చేప‌ట్టాల‌ని డిమాండ్ చేశారు టీడీపీ జాతీయ అధ్య‌క్షులు నారా చంద్ర‌బాబు నాయుడు.