వైకాపాకు బాబు వార్నింగ్..!!

ప్రతి విషయంలోనూ రాజకీయాలు చేయాలని చూసే జగన్ లాంటి వాళ్లను చాలా మందిని చూశానని వ్యాఖ్యానించారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. అసెంబ్లీ వాయిదా పడ్డ తరువాత ఆయన మీడియాతో మాట్లాడారు. తొక్కిసలాట పై ఈ రోజు అసెంబ్లీ లో జగన్ చేసిన వ్యాఖలను తప్పుబట్టారు బాబు.

 

పుష్కర ఘాట్ లో జరిగిన తొక్కిసలాటకు తాను ఇప్పటికీ బాధపడుతున్నానని, ఆరోజు ఏ ప్రభుత్వమూ స్పందించనంత వేగంగా స్పందించానని, పీఠాధిపతి పుష్కర ఘాట్ లో ఉండబట్టే తాను కూడా అక్కడికే వెళ్లానుతప్ప మరే ఇతర కారణాలూ చెప్పారు.

జగన్ మంచి సలహాలు ఇస్తే హర్షించి ఉండేవాడినని, కానీ వాస్తవానికి అలా జరగడం లేదని, ఇది రాష్ట్రమంతటికీ దురదృష్టకరమని అన్నారు. అలాగే ప్రతిపక్షంగా ఏది పడితే అది మాట్లడోచ్చని జగన్ అనుకుంటున్నారని, పదే పదే రెచ్చ గొట్టే ధోరణిలో మాట్లాడటం సరికాదని, అది ఆయన అపరిపక్వతకు నిదర్శనమని అన్నారు.

అయితే, ప్రతి అంశాన్నీ వివాదాస్పదం చేయాలనేది జగన్ ఉద్దేశమని, ప్రతీ దానికి ఓ లిమిట్ ఉటుందని, ఆ లిమిట్ ను దాటితే మాత్రం సహించబోమని, అధికార పక్షంగా ఏం చేయాలో ఆ విదంగా  యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు బాబు. పద్దతిగా ఉండాలని ఈ సందర్భంగా విపక్షానికి సూచనా చేశారాయన.