గణపతి సచ్చిదానంద ఆశ్రమానికి చంద్రబాబు 

ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో రాష్ట్రంలో విమానాశ్రయాల విస్తరణ, కొత్త ఎయిర్ పోర్ట్ ల  అంశంపై సమీక్ష నిర్వహించారు. కేంద్ర పౌర విమానయానశాఖామంత్రి రామ్మోహన్ నాయుడు ఆన్ లైన్ లో సమీక్షకు హాజరయ్యారు.  మధ్యాహ్నం  విజయవాడలోని గణపతి సచ్చిదానంద ఆశ్రమానికి చంద్రబాబు వెళ్లారు. అక్కడ్నుంచి చంద్రబాబు హైద్రాబాద్ చేరుకుంటారు. అక్కడ హైటెక్స్ లో జరుగనున్న వరల్డ్  తెలుగు ఫెడరేషన్ సదస్సుకు హాజరుకానున్నారు.