చరిత్రలో కొత్త పదం ‘చంద్రబాబు శపథం’!

శపథం అంటే చంద్రబాబు చేసినట్టుండాలి.. శపథం అంటే చంద్రబాబు నెరవేర్చినట్టుండాలి.. ఇంతకాలం మనకు ‘చాణక్య శపథం’ అనే పదం మాత్రమే తెలుసు.. తెలుగు ప్రజలకు మరో కొత్త పదం పరిచయమైంది.. అది రాజకీయ చాణక్యుడు చంద్రబాబు చేసిన శపథం ద్వారా క్రియేట్ అయింది. అదే ‘చంద్రబాబు శపథం’.

‘‘ఇన్నేళ్ళూ పరువు కోసం బతికాను. అలాంటిది ఈరోజు సభలో నా  భార్య ప్రస్తావన తెచ్చి, అసభ్య వ్యాఖ్యలు చేశారు. ఇది గౌరవ సభ కాదు.. కౌరవ సభ. ఇలాంటి సభలో నేనుండలేను. మళ్ళీ ముఖ్యమంత్రిగానే ఈ సభలో అడుగుపెడతాను. లేకపోతే నాకు రాజకీయాలే వద్దు. మీ అందరికీ ఓ నమస్కారం’’ అని నవంబర్ 19, 2021న శాసనసభలో చంద్రబాబు తీవ్ర అవమాన భారంతో శపథం చేశారు. ఆరోజు నుంచి ఆయన అసెంబ్లీకి వెళ్ళలేదు. ప్రజల నుంచే తీర్పు కోరారు. ప్రజలు సరైన తీర్పు ఇచ్చారు. ‘చంద్రబాబు శపథం’ నెరవేరేలా చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగానే శుక్రవారం (21-06-24) శాసనసభలోకి అడుగుపెట్టారు. గౌరవ సభలోకి చాలా గౌరవంగా ముఖ్యమంత్రి హోదాతో అడుగుపెట్టారు. ‘చంద్రబాబు శపథం’ అనే కొత్త పదాన్ని సృష్టించారు.