బెల్లం గణపతి నిమజ్జనం!

గ్రేటర్ విశాఖపట్నం పరిధిలోని గాజువాకలో ఏర్పాటు చేసిన 75 అడుగుల బెల్లం వినాయకుడి నిమజ్జనం శనివారం (సెప్టెంబర్ 28) జరగ నుంది. వినాయక చవితి నుంచి 21 రోజుల పాటు భక్త జనం పూజలు అందుకున్న ఈ భారీ బెల్లం వినాయకుడి నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి.  లంబోదర ట్రస్టు ఆధ్వర్యంలో  18 టన్నుల బెల్లం కుందులను వినిగించి రూపొందించిన ఈ భారీ వినాయక  విగ్రహం భక్తులను విశేషంగా ఆకర్షించింది. ముందుగా వినాయకుడి విగ్రహ తయారీ కోసం వినియోగించిన బెల్లాన్ని ప్రసాదంలా భక్తులకు పంచుదామని నిర్వాహకులు భావించినప్పటికీ.. ఆరోగ్య కారణాల దృష్ట్యా విగ్రహ తయారీకి వినియోగించిన బెల్లాన్ని నిమజ్జనం ద్వారా కరిగించేయడమే మేలన్న నిర్ణయానికి వచ్చారు.