మెగాస్టార్‌ కీర్తి కిరీటంలో మరో వజ్రం!

మెగాస్టార్ చిరంజీవిని మరో ప్రతిష్ఠాత్మక పురస్కారం వరించింది.  సెప్టెంబర్ 22న గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించి., చరిత్ర సృష్టించిన మెగాస్టార్ కు తాజాగా  ఔట్ స్టాండింగ్ అచీవ్ మెంట్  ఇండియన్ సినిమా పురస్కారం దక్కింది. 2024 అబుదాబీలో జరిగిన ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్  కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమంలో టాలీవుడ్ సీనియర్ హీరోలు బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్ కూడా పాల్గొన్నారు. అవార్డు గెలుచుకున్నందుకు చిరంజీవిని వారు అభినందించారు. చిరంజీవి తన 46 ఏళ్ల సినీ ప్రస్థానంలో 156 సినిమాలు, 537 పాటలు, 24,000 స్టెప్పులతో ప్రేక్షకులను అలరించి  గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించిన రోజుల వ్యవధిలోనే మరో ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకోవడం విశేషం.