జమిలి ఎన్నికలకు చంద్రబాబు జై!

రాష్ట్రాలకు, కేంద్రానికి ఒకేసారి ఎన్నికలు జరిపే జమిలి ఎన్నికల విధానానికి దేశమంతా మద్దతు తెలపాల్సిన అవసరం వుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. దేశమంతటా సుస్థిర పాలన వుంటేనే దేశంలో అభివృద్ధి పెరుగుతుందని, దేశమంతటా సుస్థిర పాలన జమిలి ఎన్నికల ద్వారా వస్తుందని చంద్రబాబు అన్నారు. ‘‘ప్రతి ఏటా ఏదో ఒక రాష్ట్రానికి ఎన్నికలు రావడం వల్ల అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతోంది. పార్లమెంటుకు, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే అందరూ అభివృద్ధి మీద దృష్టి పెట్టవచ్చు’’ అని చంద్రబాబు అన్నారు. హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధించడం ఎన్డీయే కూటమికి శుభసూచకమని చంద్రబాబు అభిప్రాపడ్డారు. మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికలలో కూడా ఎన్డీయేకి మంచి ఫలితాలు వస్తాయన్న ఆశాభావాన్ని చంద్రబాబు వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ని ప్రైవేటీకరణ  కాకుండా అడ్డుకుంటామని ఆయన అంటూ, జగన్ రాష్ట్రానికి పట్టిన పెద్ద అరిష్టమని చెప్పారు.