టీఆర్ఎస్, వైసీపీ కుట్రలు.. గెలుపు ఏకపక్షమే!!

 

ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం ఎలక్షన్ మిషన్-2019పై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీల ఐక్యత దెబ్బతీయాలనే కుట్ర జరుగుతోందని, బీసీలపై వైసీసీ, టీఆర్‌ఎస్‌ కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌ 29 కులాలను బీసి జాబితా నుంచి తొలగించిందన్నారు. టీఆర్‌ఎస్‌తో జగన్‌ కలయిక బీసీ వ్యతిరేకమని విమర్శించారు. కుట్రలు, కుతంత్రాలే వైసీపీ అజెండా అని ధ్వజమెత్తారు. ఇటీవల రాజమండ్రిలో విజయవంతంగా నిర్వహించిన జయహో బీసి సభ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీడీపీ నేతలు, అభిమానులు, కార్యకర్తలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. రాజమండ్రి సభ 'మూడ్ ఆఫ్ ది స్టేట్'కు నిదర్శనమని అన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఏకపక్షం కానుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.