భారతరత్న హృదయపూర్వకంగా ఇవ్వలేదు!!

 

మజ్లిస్ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ భారతరత్న అవార్డుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం దేశంలోనే అత్యున్నత పురస్కారమైన భారతరత్నను తాజాగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రముఖ గాయకుడు భూపేన్ హజారికా, సామాజికవేత్త నానాజీ దేశ్ ముఖ్లకు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలోని కల్యాణ్ నగరంలో వంచిత్ బహుజన్ సభలో ఒవైసీ మాట్లాడారు. గతంలో భారతరత్న అవార్డును బీఆర్ అంబేద్కర్ కు బలవంతంగా ఇచ్చారు కాని, హృదయపూర్వకంగా ఇవ్వలేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు ఎంతమంది దళితులు, ఆదివాసీలు, ముస్లింలు, పేదలు, అగ్రవర్ణాలైన బ్రాహ్మణులకు భారతరత్న అవార్డులు ఇచ్చారని ఒవైసీ కేంద్రాన్ని ప్రశ్నించారు.