డబుల్ బెడ్ రూమ్ తో అసంతృప్తి మాయం
posted on Dec 21, 2015 6:31PM

డబుల్ బెడ్ రూం ఫ్లాట్లను తెలంగాణలోని పేదలకు అందించాలన్న భారీ పథకాన్ని చేపట్టి.. కేంద్ర సాయం కోసం ఆశగా ఎదురుచూస్తున్న తెలంగాణ సర్కారు డిమాండ్ పై కేంద్రం సానుకూలంగా స్పందించింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. కొన్ని రాష్ట్రాలకు ఇళ్లను కేటాయించిన కేంద్రం.. అప్పట్లో తెలంగాణకు కేవలం 10వేల ఇళ్లను మాత్రమే కేటాయించింది. దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. పక్కనున్న ఏపీకి భారీగా ఇళ్లను కేటాయించి.. తెలంగాణకు మరీ తక్కువగా కేటాయిస్తారా? అన్న ప్రశ్నలు వ్యక్తమయ్యాయి. తమకు మరిన్ని ఇళ్లు కేటాయించాలంటూ కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్రం కోరింది. దీనికి సానుకూలంగా స్పందించిన తెలంగాణ సర్కారు తాజాగా 45217 ఇళ్లను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. గతంలో కేటాయించిన దానికి అదనంగా కేటాయింపులు జరిపిన కేంద్రం.. తెలంగాణ సర్కారు కోరినన్ని ఇళ్లు కేటాయించినట్లుగా పేర్కొంది.